TML 02 04 22 ROJA DHARSAN

TML 02 04 22 ROJA DHARSAN

think different27

54 года назад

4 Просмотров

TML 02 04 22 ROJA DHARSAN


యాంకర్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరుని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా...ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల మీడియాతో రోజా మాట్లాడుతూ.....తెలుగు ప్రజలకు శుభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. గత రెండు సంవత్సరాల్లో ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులు పటాపంచలు కావాలి కోరుకున్నట్లు చెప్పారు.సీఎం జగన్ సుపరిపాలనలో ప్రజల కష్టాలు తీరి... సుఖసంతోషాలతో ప్రజలు ఉండాలని ప్రార్ధించానన్నారు. సీఎం జగన్ ఆయుర్ ఆరోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. 42 సంవత్సరాల అనంతరం చారిత్రాత్మక నిర్ణయం తీసుకోనున్నారు సీఎం జగన్ అని కొనియాడారు. జిల్లాల విభజన శ్రీకారం చుట్టడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. నగరి ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు

బైట్: ఆర్కే రోజా., నగరి ఎమ్మెల్యే
Ссылки и html тэги не поддерживаются


Комментарии: